Onam Season | మలయాళీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగల్లో ముఖ్యమైనది ఓనమ్. మలయాళ మాసమైన చింగం (ఆగస్టు-సెప్టెంబర్)లో యేటా 10 రోజులపాటు సాగే సాంస్కృతిక వేడుక. ఈ ఏడాది ఓనమ్ వేడుకలు ఆగస్టు 16 (నేడు) ‘అథం’తో మొదలై ఆగస్టు 26న జరుపుకునే ‘తిరువోణం’తో ముగుస్తాయి.
మహాబలి చక్రవర్తి పురాణ ప్రసిద్ధ స్వదేశాగమనానికి ప్రతీకగా నిలిచే ఓనమ్‌కు కేరళం వీధులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఓనమ్ వేడుకలకు ఘనంగా స్వాగతం పలుకుతూ త్రిస్సూర్‌లోని వడక్కున్నాథన్ టెంపుల్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ఫ్లోరల్ కార్పెట్‌ను సిద్దం చేశారు. రంగురంగుల పూలతో రెడ్ కార్పెట్‌ను సిద్ధం చేసి ఓనమ్‌కు స్వాగత ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
#WATCH | Keralam | A grand floral carpet has been prepared at the Vadakkunnathan Temple grounds in Thrissur, marking the arrival of the Onam season pic.twitter.com/JQuSs2f8w8
— ANI (@ANI) August 16, 2026