Ganesh Immersion | పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 04 : వినాయక చవితి పండుగలో భాగంగా గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తి చేసుకోవాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట పెద్ద చెరువులో వినాయకుడి నిమజ్జనం చేసే ప్రాంతాన్ని గురువారం సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రాజయ్య యాదవ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొల్పిన వినాయకుల విగ్రహాలను నిర్వాహకులు అంతా కూడా వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా 11 గంటలలోపు నిమజ్జనం జరిగేలా చూసుకోవాలన్నారు. నిమజ్జన ర్యాలీలలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువు ప్రాంతంలో వాహనాలు వచ్చి గణపతి నిమజ్జనం కాగానే నేరుగా బయటకు వెళ్లేలా రోడ్డు మాదిరిగా చదును చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యుత్ లైట్ల ఏర్పాటు సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్, ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ, పంచాయతీ కార్యదర్శులు కల్లెపల్లి శ్రీలత, దేవరనేని నిశాంత్ రావు, నాయకుడు ఆరె సంతోష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
GST | సిమెంట్, ఉక్కుపై జీఎస్టీ రేట్ల తగ్గింపు.. రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహం..!
Laxmidevipally : ‘పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి’
Nur Khan Base | భారత్ దాడిలో దెబ్బతిన్న నూర్ఖాన్బేస్లో పునర్నిర్మాణ పనులు చేపడుతున్న పాక్