ఇస్లామాబాద్, మార్చి 2 : పాకిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలను అఫ్ఘానిస్థాన్ టార్గెట్ చేసింది. రావల్పిండిలోని ‘నూర్ ఖాన్’ ఎయిర్‌బేస్‌పై వైమానిక దాడుల చేశామని ఆఫ్ఘనిస్థాన్ రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. ఇరు దేశాలను విడదీస్తున్న డ్యూరాండ్ రేఖను తమ సైనికులు దాటుకొని పాకిస్థాన్ భూభాగంలోకి అడుగుపెట్టారని తాలిబన్ మంత్రి ఒకరు చెప్పారు.
క్వెట్టా, ఖైబర్ పఖ్తూంఖ్వాలోని వివిధ ప్రాంతాల్లో మిలిటరీ బేస్‌లపై దాడులు చేసినట్టు ప్రకటించారు. ఇరు దేశాల పరస్పర దాడులు, సరిహద్దుల్లో కాల్పులు నాలుగో రోజుకు చేరుకున్నాయి. తమ సైనిక ఆపరేషన్‌లో 400 మంది అఫ్ఘాన్ ఫైటర్లను మట్టుబెట్టినట్టు పాకిస్థాన్ ప్రకటించుకుంది. కాబూల్ సహా అఫ్ఘాన్‌లోని వివిధ ప్రావిన్స్‌లపై దాడులు చేసినట్టు పాక్ అధికార వర్గాలు తెలిపాయి.