హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : దివ్యాంగులైన పురుషులకు మహిళలతో సమానంగా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో కల్పించారంటూ ఓ తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ సోమవారం పేర్కొంది.
దివ్యాంగులందరికీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్త పూర్తిగా అవాస్తవమని, అదొక తప్పుడు జీఓ అని తెలిపింది.