సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ కొల్లూర్‌లోని ఫేజ్-2 కేసీఆర్‌నగర్ 2బీహెచ్‌కే సముదాయంలో యూపీ హెచ్‌సీ దవాఖాన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దవాఖాన పనులు పూర్తికాకపోవడంతో 2బీహె చ్‌కే వాసులకు వైద్యసేవలు దూ రమవుతున్నాయి. రోగమొచ్చి నా..నొప్పొచ్చినా అందుబాటులో దవాఖాన లేకపోవ డంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతు న్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రైవేట్ దవాఖానలనే ఆశ్రయిం చాల్సిన పరిస్థితి నెలకొంది. రోజువారీ కూలీనాలి చేసుకుంటే తప్ప పూటగడవ ని పేదలకు రోగాలు వస్తే ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడం భారంగా మారింది.
రామచంద్రాపురం,ఆగస్టు 9 : సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ కొల్లూర్‌లోని ఫేజ్-2 కేసీఆర్‌నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో మొత్తం 15,660 గృహాలు ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ 60శాతానికి పైగా జనం నివాసం ఉంటున్నారు. పిల్లల చదువులు, ఉద్యోగ్యాల రీత్యా మిగతావారు వారాంతంలో ఇక్కడి వచ్చి ఉంటున్నారు. ఆయా బ్లాక్‌ల సొసైటీలకు లబ్ధిదారులందరూ అపార్ట్మెంట్ల నిర్వహణ కోసం మెయింటనెన్స్ చెల్లిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుం డా పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నది. పలుసార్లు 2బీహెచ్‌కే వాసులు ధర్నాలు, నిరసనలు చేసినా వారి సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఓట్ల కోసం మంత్రులు అప్పటికప్పుడు స్పందించి కొన్ని సమస్యలను పరిష్కరించారు. కానీ, మేజర్ సమస్య దవాఖాన నిర్మాణ పనులు ఇంకా పూర్తి చేయించలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. వేలాది మంది ప్రజలు నివాసం ఉండే చోట నేటికి వైద్యసేవలు అందుబాటులోకి రాకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇప్పటికైనా స్పందించి దవాఖాన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కొల్లూర్‌లోని 2బీహెచ్‌కే సముదాయంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న యూపీహెచ్సీ దవాఖాన నిర్మాణ పనులను సంక్రాంతి అంటే(జనవరి)నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని బహిరంగ సభలో మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చి నేటికి 10నెలలు గడుస్తున్నది. ఇప్పటికీ దవాఖాన 2బీహెచ్‌కే వాసులకు అందుబాటులోకి రాలేదు. గత నవంబర్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో 2బీహెచ్‌కే సముదాయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ వచ్చారు.
ఆ సందర్భంలో అక్కడ నిర్వహించిన బహిరంగ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రసంగిస్తు నిర్మాణంలో ఉన్న యూపీహెచ్సీ దవాఖాన పనులు సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. దవాఖానను ప్రారంభించడంతో పాటు ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. కానీ, హామీ కార్యరూపం దాల్చలేదు. ఉప ఎన్నిక సమయంలో ఓట్ల కోసం హామీలు గుప్పించి, ఎన్నిక పూర్తి కాగానే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించి పనులు పూర్తి చేయించి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.