Jurala Project | జూరాల వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Jurala Project | మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. రైతులతో కలిసి ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు.
Jurala Project | జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు ధర్నాకు తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. రైతులతో కలిసి ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అలాగే ధర్నా చేసేందుకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. రైతులను బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఓఎస్సై ఓ రైతు గల్లా పట్టుకుని అడ్డుకున్నారు. అలాగే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారీగా పోలీసుల పహారా కొనసాగుతోంది. పోలీసులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు కూడా అక్కడే మకాం వేశారు.

Jurala Project6

Jurala Project5

Jurala Project4

Jurala Project3

Jurala Project2

Jurala Project1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
Nutrition | పోషకాహారం అధికంగా తీసుకోవడం లేదా వ్యాయామ తీవ్రత.. గుండె జబ్బులకు ఏది కారణం..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

