Nani | నాని ‘ది ప్యారడైజ్’కు భారీ హైప్.. పదివేల మంది ఫ్యాన్స్‌తో ప్రత్యేక సమావేశం
Nani | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 23 నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాని అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Nani | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 23 నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాని అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ రాగా, దాదాపు 2 గంటల 49 నిమిషాల నిడివితో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు సినిమా నుంచి విడుదలైన ‘ఆయా షేర్’, ‘ఏషనాగుల’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి ఈ వేడుకకు హాజరైతే నాని అభిమానులతో పాటు మెగా అభిమానులకు కూడా ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.మరోవైపు నాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తర్వాత పదివేల మంది ఫ్యాన్స్ తో ప్రత్యేక సమావేశం కానున్నారు. దేశ వ్యాప్తంగా నాని ఫ్యాన్స్ ఈ కార్యక్రమానికి రానున్నారని చెబుతుండగా, వారికి వెజ్, నాన్ వెజ్‌తో డెలిషియస్ భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారట. ఈ విషయం తెలిసిన నాని ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘ది ప్యారడైజ్’ విషయంలో చిత్ర బృందం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు ప్రత్యేకంగా ట్రైలర్ విడుదల చేయకుండా నేరుగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నాని గతంలో వెల్లడించారు. కథ, సినిమాలోని కంటెంట్‌పై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా భారీ చిత్రాలకు ట్రైలర్ ద్వారా మరింత ప్రచారం కల్పిస్తారు. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ‘ఏషనాగుల’ పాటలో కీర్తి సురేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘మాలిక్’ అనే కీలకమైన, శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

