Lightning strikes | తెలంగాణలో పిడుగుల బీభత్సం.. సెల్ఫోన్ పేలి ఇంటర్ విద్యార్థి, పలుచోట్ల పశువులు, గొర్రెలు మృతి..!
Lightning strikes | తెలంగాణలో ఆదివారం కురిసిన పిడుగులతో కూడిన భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వానలు కురిశాయి. దాంతో జనజీవనం అతలాకుతలం అయ్యింది. పిడుగపడి ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
Lightning strikes : తెలంగాణలో ఆదివారం కురిసిన పిడుగులతో కూడిన భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వానలు కురిశాయి. దాంతో జనజీవనం అతలాకుతలం అయ్యింది. పిడుగపడి ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరోచోట ఇద్దరు రైతులు గాయపడ్డారు. పలుచోట్ల పశువులు, గొర్రెలు మృత్యువాతపడ్డాయి.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండాకు చెందిన చరణ్ సింగ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పొలంలో తన బాబాయ్కి సాయంచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో భారీ వర్షం మొదలైంది. అదే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో చరణ్ జేబులో ఉన్న సెల్ఫోన్ పేలిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో చోటుచేసుకుంది. బొప్పాజీవాడకు చెందిన మేకల సూర్యకాంత్, బుర్గుల్ గ్రామానికి చెందిన గైని శంకర్ అనే ఇద్దరు రైతులు పత్తి చేనులో పనిచేస్తుండగా వర్షం రావడంతో గొడుగు పట్టుకుని నిల్చున్నారు. వారి సమీపంలో పిడుగుపడటంతో ఇద్దరి వద్ద ఉన్న సెల్ ఫోన్లు పేలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది.
పిడుగుల ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు భారీగా నష్టపోయారు. నిర్మల్ జిల్లా రూరల్ మండలంలో ఆరు గేదెలు, ఒక ఆవు మృతిచెందాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామారావుపల్లిలో పిడుగుపడి 12 గొర్రెలు మరణించాయి. ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లోనూ ఎద్దులు, ఆవులు పిడుగుపాటుకు బలయ్యాయి. దీంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయంపై పిడుగుపడటంతో గుడి పాక్షికంగా దెబ్బతిన్నది.
భారీ వర్షాల కారణంగా రవాణావ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్-మైల్వార్ మధ్య నిర్మిస్తున్న రోడ్డుకు వేసిన తాత్కాలిక డైవర్షన్ రోడ్డు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. హైదరాబాద్ నగరంలోని కాప్రా, మేడ్చల్, షేక్పేట్, దమ్మాయిగూడ వంటి ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. కుత్బుల్లాపూర్లో విద్యుత్ తీగలు తెగిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ వాయుగుండం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

