Fahadh Faasil | విలక్షణ నటనతో పాన్ ఇండియా స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble). ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేశారు. టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబంతో కలిసి ఫాహద్ ఫాజిల్ చేసిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సినిమా వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాజమౌళి స్వయంగా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ ‘సూరి’ అనే విభిన్నమైన స్ట్రీట్ మ్యాజీషియన్ పాత్రలో కనిపించనున్నారు. ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్ అంశాల కలయికగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది.