Suchika Tariyal | ఏసియన్ గేమ్స్ చరిత్రలో కొత్త రికార్డు.. ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం..!
Suchika Tariyal | ఏసియన్ గేమ్స్ (Asian Games) మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తారియాల్ (Suchika Tariyal) కొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగంలో సుచికా కాంస్య పతకం (Bronze Medal) సాధించింది. దాంతో ఎంఎంఏ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా సుచిత నిలిచింది.
Suchika Tariyal : ఏసియన్ గేమ్స్ (Asian Games) మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తారియాల్ (Suchika Tariyal) కొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగంలో సుచికా కాంస్య పతకం (Bronze Medal) సాధించింది. దాంతో ఎంఎంఏ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా సుచిత నిలిచింది. ఏషియన్ గేమ్స్‌లో గతంలో ఎంఎంఏకు చోటులేదు. ఈసారే ఈ క్రీడ తొలిసారి చోటు దక్కించుకుంది. ఈ క్రీడలో మూడో స్థానంలో నిలిచిన సుచిత భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.
సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో సుచికా తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు అదనపు సమయంలోకి వెళ్లింది. చివరకు స్వల్ప తేడాతో సుచిక ఓటమి పాలైంది. దాంతో ఫైనల్‌కు చేరే అవకాశం కోల్పోయినా.. అప్పటికే కాంస్య పతకం ఖాయమైంది. అంతకుముందు క్వార్టర్ఫైనల్లో మంగోలియాకు చెందిన అల్టాన్‌చిమెగ్ బైగల్మాను 2-0తో సుచికా ఓడించింది. దాంతో ఏషియన్ గేమ్స్‌లో ఎంఎంఏలో భారత్‌కు పతకం ఖాయం చేసిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
36 ఏళ్ల సుచికా ప్రయాణం ఒక్క ఎంఎంఏకే పరిమితం కాలేదు. జాతీయస్థాయి జూడో క్రీడాకారిణిగా ఎదిగిన ఆమె 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నది. 2023 ఏషియన్ గేమ్స్‌లో కురాష్లోనూ పోటీపడింది. ఆ తర్వాత జియూ-జిట్సులో సత్తా చాటి 2024లో ఫైటింగ్ జియూ-జిట్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2017లో ఎంఎంఏలో ప్రొఫెషనల్‌గా అరంగేట్రం చేసిన సుచికా.. జూడో, జియూ-జిట్సుపై దృష్టి పెట్టడంతో కొన్నేళ్లు ఈ క్రీడకు దూరంగా ఉన్నది.
2024లో మళ్లీ ఎంఎంఏలోకి వచ్చి ‘బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్’ తో ఒప్పందం చేసుకుంది. గాయం వంటి అడ్డంకులను అధిగమించి తిరిగి వచ్చిన ఆమె.. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక పతకం అందించింది. ఏషియన్ గేమ్స్‌లో ఎంఎంఏను తొలిసారి ప్రవేశపెట్టగా.. వెంటనే భారత్‌కు పతకం రావడం విశేషం. ఈ ఘనత భారత ఎంఎంఏ చరిత్రలో సుచికా తారియాల్‌కు ప్రత్యేక స్థానం కల్పించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

