మంథని : జర్నలిస్టుల(Journalists) సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) అన్నారు. మంథని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంథని పట్టణంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేపిస్తానని, ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగస్వామ్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, కోశాధికారి తగరం రాజు, సభ్యులు దొరగోర్ల రవితో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..