నిర్మల్ : నిర్మల్(Nirmal) జిల్లా లక్ష్మణచందాలో గత రెండు రోజులుగా మీసేవ సైట్(Meeseva site) మొరాయించడంతో విద్యార్థులు తీవ్రంగా ఇక్కట్లకు గురవుతున్నారు. గురుకుల పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి ఒకటవ తేదీ చివరి రోజు కావడంతో కులము, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పని సరి కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మీసేవ, తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ మీసేవ సైట్ గత రెండు రోజులుగా పనిచేయకపోవడంతో ధ్రువీకరణ పత్రాలు పొందలేకపోతున్నారు. శనివారం చివరి రోజు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గురుకుల పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెంచాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..