Purchase Centres | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 22: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇంతటి అన్నయ్య గౌడ్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పెరిక పల్లి, మియాపూర్, చిన్న బొంకూర్, రెబల్దేవపల్లి గ్రామాల్లో ఇవాళ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఇంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావులు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కందుల రాజు, పాలకవర్గ సభ్యులు మేకల వీరయ్య, నలవాల శ్రీకాంత్, పోచంపల్లి పద్మ లక్ష్మణ్, తాండ్ర నిర్మల శంకర్ లతో పాటు మాజీ సర్పంచులు ప్రజా ప్రతినిధులు రైతు , సంఘ సిబ్బంది, సీఈవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు