పెద్దపల్లి రూరల్ నవంబర్ 13 : పశువుల ఆరోగ్యం పట్ల రైతులు అప్రమ్తంగా ఉండాలని రాగినేడు పశువైద్యాధికారి అఖిల్ రాజ్ అన్నారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని గుర్రాంపల్లిలో గురువారం పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేశారు. ఈ సందర్భంగా రైతులకు పశువులకు సంబంధించిన వ్యాధుల నివారణ వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులంతా పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, పశుమిత్రలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Sri Lankan Team | ఇస్లామాబాద్ భారీ బ్లాస్ట్.. స్వదేశానికి వెళ్లిపోతామన్న శ్రీలంక ఆటగాళ్లు..!
Cellphones | దవాఖానలో రోగుల సెల్ఫోన్లు ఎత్తుకెళ్తున్న దొంగ.. వీడియో