హైదరాబాద్: అనారోగ్యం బారినపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులను (Patients) కూడా దొంగలు వదలడం లేదు. అంతా నిద్రపోతుండగా హాస్పిటల్లోని ఓ వార్డులోకి ప్రవేశించిన దుండగుడు చేసిన పనిచూసి అంతా విస్తుపోయారు. ముసుగు ధరించిన ఆ వ్యక్తి మెళ్లగా రోగుల వద్దకు వెళ్లి మెల్లగా వారి ఫోన్లు (Cellphones ) ఎత్తుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ దవాఖానలో (Araku Valley Hospital) ఈ నెల 10న జరిగింది.
గత సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హాస్పిటల్లో రోగులు అందరూ మంచి గాఢ నిద్రలో ఉన్న సమయంలో లోపలికి ఓ దుండగుడు ప్రవేశించాడు. ఓ వార్డులోకి చొరబడి.. అందులోని రోగుల మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. అయితే ఈ వ్యవహారం మొత్తం వార్డులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఇతగాడి యవ్వారం బయటపడింది. పుటేజీ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే హాస్పిల్లో దొంగలు హల్చల్ చేస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్నది.
Cellphones stolen from patients at Araku Valley Hospital, in Alluri Sitharama Raju district, raises security concerns.
A stranger stole the cellphones of sleeping patients at midnight, recorded on #CCTV camera.#ArakuValley #Alluri #Cellphones #AndhraPradesh #CellphonesTheft pic.twitter.com/JKTiQott2Y
— Surya Reddy (@jsuryareddy) November 12, 2025