Scott Bessent | విదేశీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయ వలసదారులను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నుంచి హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై అనూహ్య స్పందన వ్యక్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఈ వీసా ప్రోగ్రామ్ని గట్టిగా సమర్థించారు. ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన స్వదేశీ ఉద్యోగులు లేని కారణంగా విదేశాల నుంచి నైపుణ్యం తెచ్చుకోవడం దేశానికి అవసరమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో హెచ్-1బీ వీసాలపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇప్పించేందుకే హెచ్1బీ ఉద్యోగాలని తెలిపారు.
ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ (Scott Bessent) మాట్లాడుతూ.. ట్రంప్ కొత్త H-1B వీసా విధానం (H1B visa plan) నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికన్ కార్మికులకు (US workers) శిక్షణ ఇవ్వడానికి తీసుకురావడానికి రూపొందించబడిందని వెల్లడించారు. అంతేకాని, విదేశీయులను భర్తీ చేసేందుకు కాదని స్పష్టం చేశారు. ‘అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోండి. ఆ తర్వాత అమెరికన్లే పూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు’ అనేదే వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానం అని వెల్లడించారు. విదేశీ కార్మికులపై దీర్ఘకాలంగా ఆధారపడకుండా ఉండేందుకే ఈ నిర్ణయమని తెలిపారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడు ఉగ్రవాద దాడే : అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో
US Shutdown | అమెరికాలో ముగిసిన షట్‌డౌన్.. ఫండింగ్ బిల్లుపై ట్రంప్ సంతకం
OPT | ఓపీటీ రద్దు?.. అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ మరో షాక్!