US Shutdown | అమెరికాలో ముగిసిన షట్‌డౌన్.. ఫండింగ్ బిల్లుపై ట్రంప్ సంతకం
US Shutdown | అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ (US Shutdown)కు తెరపడింది.
US Shutdown | అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ (US Shutdown)కు తెరపడింది. అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్కు ముగింపు పలికేందుకు ప్రభుత్వ ఫండింగ్ బిల్లు (funding bill)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బుధవారం రాత్రి సంతకం చేశారు. అంతకు ముందు రిపబ్లికన్ నేతృత్వంలోని ప్రతినిధుల సభలో 222-209 తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేశారు. దీంతో 43 రోజుల పాటూ సుదీర్ఘంగా సాగిన ప్రభుత్వ షట్డౌన్కు ముగింపు పడినట్లైంది. మూడు రోజుల క్రితమే ఈ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే.
సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు ఆమోదం దక్కకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబర్ 30, అర్ధరాత్రి (11:59 నిమిషాలు) వరకు ఆ బిల్లు క్లియరెన్స్ కోసం ఎదురుచూశారు. కానీ డెమోక్రాట్లు తగ్గకపోవడంతో.. ట్రంప్ సర్కారు షట్‌డౌన్ ప్రకటించింది. సేనేట్‌లో రిపబ్లికన్లకు కంట్రోల్ ఉన్నా.. బిల్లును పాస్ చేయించుకోలేకపోయారు. ఫండింగ్ బిల్లు సేనేట్‌లో పాస్ కాకపోవడం వల్ల నిరవధికంగా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు వైట్‌హౌజ్ పేర్కొన్నది.
దాదాపు 43 రోజుల పాటూ షట్‌డౌన్ కొనసాగింది. అమెరికా చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన ‘షట్‌డౌన్’గా రికార్డు సృష్టించింది. ఈ షట్‌డౌన్ కారణంగా భారీగా నష్టం వాటిల్లింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం ముఖ్యంగా విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. షట్‌డౌన్ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజరు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆలస్యంగా అయ్యాయి. పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌పై ఒత్తిడి తగ్గించడానికే ప్రభుత్వం విమాన సేవల్లో కోతను కూడా విధించింది.
Also Read..
OPT | ఓపీటీ రద్దు?.. అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ మరో షాక్!
Donald Trump | లైంగిక బాధితురాలితో గంటల తరబడి ట్రంప్!
Roman Novak | దుబాయ్ ఎడారిలో ఘోరం.. రష్యన్ దంపతుల దారుణ హత్య
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

