వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) ఇరుకున పెట్టేందుకు కొత్తగా మరికొన్ని ఈ-మెయిల్స్‌ను యూఎస్ హౌస్ డెమోక్రాట్స్ మంగళవారం విడుదల చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ అందజేసిన వేలాది పత్రాల్లో ఇవి కొన్ని. కొన్ని చోట్ల ట్రంప్‌ను నేరుగానే ఎప్స్టీన్ ప్రస్తావించడం కనిపించింది. 2011లో పంపిన ఈ-మెయిల్లో, “ఆ మొరగని కుక్క ట్రంప్ అని నువ్వు తెలుసుకోవాలి. బాధితురాలు నా ఇంట్లో గంటల తరబడి ట్రంప్‌తో గడిపింది” అని చెప్పారు. ఈ విధంగా ట్రంప్‌ను, బాధితురాలిని ప్రస్తావించిన ఈ-మెయిల్ బయటపడటంతో అమెరికాలో రాజకీయ దుమారం తీవ్రమైంది.