న్యూఢిల్లీ : ఇరాన్ నేడు మళ్లీ భారీ దాడులను ఎదుర్కోనున్నదని అమెరికా రక్షణ మత్రి పీటె హెగ్సెత్ గురువారం ప్రకటించారు. ప్రస్తుత యుద్ధం అమెరికా షరతులపైన ముగుస్తుందని, అమెరికా తన మిషన్ని పూర్తిచేయడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు 7,000కిపైగా లక్ష్యాలపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు ఆయన చెప్పారు.
ఇరాన్ భారీ సైనిక దాడులను చవిచూడనున్నదని రక్షణ మంత్రి ప్రకటించారు. తమ శక్తి పెరుగుతుంటే ఇరాన్ శక్తి క్షీణిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ఛిద్రమయ్యాయని హెగ్సెత్ చెప్పారు. ఖర్గ్ ద్వీపంపై ఇరాన్ సైనిక సామర్థ్యంపై జరిగిన దాడులతో ఆ దేశ భవిష్యత్తు అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన చెప్పారు.