న్యూఢిల్లీ : పశ్చిమాసియాలోని గ్యాస్ కేంద్రాలపై తాజా దాడులు కొత్త ఆందోళనలను రేకెత్తించాయని భారత్ పేర్కొన్నది. అలాంటి దాడులు నిలిపేయాలని గురువార ం యుద్ధం చేస్తున్న దేశాలకు పిలుపునిచ్చింది. ఇంధన వ్యవస్థలతో సహా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయొద్దని భారత్ గతంలోనే పిలుపునిచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు తాను ముగ్గురు దేశాధినేతలతో చర్చించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు.