మంచిర్యాలలో మారిన రాజకీయం
మంచిర్యాలలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. మొన్నటి వరకూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్న మంతెన జగన్మోహన్రావు మంత్రి వివేక్‌తో చీకటి ఒప్పందం నడిపిస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ‘మంత్రి నీడలోకి జగన్నాటక సూత్రధారి’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనాలు అక్షరసత్యాలు అయ్యాయి.
- ముందే చెప్పిన ‘నమస్తే తెలంగాణ’
- ముఖ్యమంత్రి సభలో జగన్మోహన్రావు
- మంత్రి వివేక్ సమక్షంలో ప్రత్యక్షం
- బట్టబయలైన జగన్నాటకం
మంచిర్యాల, ఆగస్టు 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. మొన్నటి వరకూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్న మంతెన జగన్మోహన్రావు మంత్రి వివేక్‌తో చీకటి ఒప్పందం నడిపిస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ‘మంత్రి నీడలోకి జగన్నాటక సూత్రధారి’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనాలు అక్షరసత్యాలు అయ్యాయి. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి క్షిణించిన సమయంలో ఆయన తర్వాత జగన్మోహన్రావు ఎమ్మెల్యే రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.
ఈ మేరకు జగన్ మంత్రి వివేక్‌తో రహస్య చర్చలు జరిపినట్లు గతంతో విశ్వసనీయ సమాచారం ‘నమస్తే తెలంగాణ’కు అందింది. ఈ మేరకు మంత్రి నీడలోకి జగన్నాటక సూత్రధారి, రచ్చకెక్కిన జగన్నాటకం శీర్షికన కథనాలు ప్రచురించిన విషయం విదితమే. ఈ నెల 15, 16 తేదీల్లో మంత్రి సమక్షంలో జగన్ బలనిరూపణ చేయనున్నారనే కథనాలు సైతం వెలువరిచింది. అందుకు తగ్గట్టుగానే శనివారం సంగారెడ్డిలో జరిగిన సీఎం సభలో జగన్మోహన్ కనిపించడం మంచిర్యాల జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయం మంచిర్యాల ఎమ్మెల్యేకు మింగుడుపడకుండా మారింది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో కొంతకాలంగా అంటీముట్టన్నట్లుగా ఉంటున్న జగన్ ప్రస్తుతం సీఎం సభలో పాల్గొని తన బలాన్ని మంచిర్యాల నియోజకవర్గంలో చూపించేందుకు ఈ వేదికను కేంద్రంగా చేసుకున్నట్లు తెలుస్తున్నది. మంత్రి వివేక్ అండదండలు జగన్మోహన్కు పుష్కలంగా ఉన్నాయని, ఈ బలంతోనే జగన్ సీఎంతో సన్నిహితంగా మెదులుతూ ముందుకు సాగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

