హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అధ్యయన యాత్రలో భాగంగా ఫిన్లాండ్ పర్యటనకు 33 మంది టీచర్లను పాఠశాల విద్యాశాఖ ఎంపికచేసింది. మొదటి బ్యాచ్‌లో 40 మంది బృందం ఫిన్లాండ్లో పర్యటించగా, తాజాగా రెండో బ్యాచ్‌లో 33 మంది టీచర్లను ఎంపిక చేసింది.
జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ బృందం ఫిన్లాండ్లో పర్యటించనున్నది. ఎంపికైన వారిలో సుశీలాబాయి రాజ్‌పాల్‌రెడ్డి, వీ లచ్చిరాం, హిరణ్య, మమత, విజయ్‌పాల్‌రెడ్డి, నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు.