హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : వివాహిత సౌందర్య ఆత్మహత్య కేసులో మేడ్చల్ మలాజిగిరి జిల్లా ఫీర్జాదిగూడకు చెందిన చెన్నబోయిన సాయికృష్ణ, స్వరూపారాణి, ఇతర నిందితులకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సౌందర్య సూసైడ్ నోట్లో నిందితుల పేర్లు లేవన్న కారణంతో ఈ కేసును ప్రాథమిక దశలోనే కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టంచేసింది.
అదనపు కట్నం కోసం వేధించడం వల్లే సౌందర్య ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నందున నిందితులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని జస్టిస్ జే శ్రీనివాసరావు తేల్చిచెప్పారు.