హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : ఆహార పదార్థాల కల్తీల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా నాన్ డెయిరీ పనీర్(ఆర్టిఫీషియల్ పనీర్) తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, విక్రయాలపై ఏడాదిపాటు నిషేధం విధించింది.
రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులతోపాటు గెజిట్ నోటిఫికేషన్ సైతం జారీ చేశారు. గెజిట్ నోటిఫికేషన్తో ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 10 నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొన్నారు.