హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సంక్షేమాన్ని కేవలం ఒక బాధ్యతగా కాకుండా మానవీయ కోణంలో చూస్తూ బీఆర్ఎస్ పార్టీ అత్యుత్తమ నిర్ణయాన్ని తీసుకున్నది. పార్టీ కేంద్ర కార్యాలయం(తెలంగాణ భవన్) నిర్మాణం పూర్తయి 20 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురసరించుకొని అకడ రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ప్రతి ఉద్యోగికి భరోసానిచ్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల వయస్సు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో నిమిత్తం లేకుండా 26 మందికి రూ.5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతులమీదుగా ఉద్యోగులకు ఈ ఆరోగ్య బీమా కార్డులను అందజేయడమే కాకుండా, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సతరించారు.
మానవీయ కోణంలోనే..
తెలంగాణ భవన్లో పనిచేసే సిబ్బందికి ప్రతిరోజూ నాణ్యమైన భోజన సదుపాయం కల్పిస్తూ, వారి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనివ్వడం బీఆర్ఎస్ పార్టీ మానవీయ కోణానికి నిదర్శనంగా నిలిచింది. ఉద్యోగుల సంక్షేమంపై పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి చర్చలు జరుపుతున్న సమయంలో, పార్టీ నేత తలసాని సాయికిరణ్‌యాదవ్ ఆరోగ్య బీమా అందించాలని సూచించి, చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. తమ శ్రమను గుర్తించి గౌరవించడమే కాకుండా, తమ కుటుంబ ఆరోగ్యానికి కొండంత అండగా నిలిచినందుకు తెలంగాణభవన్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సాయికిరణ్‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.