Roman Novak | దుబాయ్ ఎడారిలో ఘోరం.. రష్యన్ దంపతుల దారుణ హత్య
Roman Novak | దుబాయ్ (Dubai) లోని ఎడారిలో ఘోరం జరిగింది. రష్యా (Russia) దేశానికి చెందిన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు రష్యన్ క్రిప్టో వ్యాపారి రోమన్ నోవాక్ (Roman Novak), అతని భార్య అన్నా నోవాక్ (Anna Novak) గా అక్కడి పోలీసులు గుర్తించారు.
Roman Novak : దుబాయ్ (Dubai) లోని ఎడారిలో ఘోరం జరిగింది. రష్యా (Russia) దేశానికి చెందిన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు రష్యన్ క్రిప్టో వ్యాపారి రోమన్ నోవాక్ (Roman Novak), అతని భార్య అన్నా నోవాక్ (Anna Novak) గా అక్కడి పోలీసులు గుర్తించారు. మృతుల శరీర భాగాలు ముక్కలుముక్కలుగా నరికివేయబడినట్టుగా తెలిపారు. ప్రతీకారంతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
పెట్టుబడిదారులతో సమావేశం ఉందని చెప్పి అక్టోబర్ 2న రోమన్ నోవాక్ దంపతులు దుబాయ్‌కి వెళ్లారు. ఒమన్ సరిహద్దుకు దగ్గరగా హట్టా ప్రాంతంలో ఒక సరస్సు దగ్గర కారు డ్రైవర్ వారిని దింపాడు. అక్కడ నుంచి మరో వాహనంలో బయలుదేరారు. ఆ తర్వాత తాను ఒమన్ సరిహద్దులోని పర్వతాల్లో చిక్కుకున్నానని, తనకు డబ్బులు కావాలని పరిచయస్తులకు రోమన్ నోవాక్ సందేశం పంపించారు.
ఈ క్రమంలో బంధువులు వెతుక్కుంటూ వెళ్లగా సమాచారం లభించలేదు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నొవాక్ ఫోన్ సిగ్నల్ ట్రాప్ చేయగా.. ఒకసారి హట్టాలో, ఇంకోసారి ఒమన్‌లో, మరొకసారి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉన్నట్లుగా తెలిసింది. ఆ తర్వాత సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి. అప్పటి నుంచి దంపతుల ఆచూకీ కోసం వెతుకుతుండగా తాజాగా దుబాయ్ ఎడారిలో మృతదేహాలు లభించాయి.
దుండగులు భార్యాభర్తల శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికేశారు. అయితే వ్యాపార లావాదేవీల్లో భాగంగానే దుండగులు కుట్ర పన్ని ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఒక పథకం ప్రకారమే పెట్టుబడిదారుల ముసుగులో ఆకర్షించి ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా రోమన్ నోవాక్ కూడా మోసగాడే. అతను ఫింటోపియో అనే ప్లాట్‌ఫామ్‌ను స్థాపించాడు.
రష్యా, చైనా, పశ్చిమాసియా నుంచి పెట్టుబడులు ఆకర్షించాడు. అనంతరం 500 మిలియన్లతో పారిపోయాడు. భారీ మోసానికి పాల్పడినందుకు 2020లో న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. సెయింట్ పీటర్స్బర్గ్ జైల్లో ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. పెరోల్ మంజూర్ కాగానే 2023లో యూఏఈకి పారిపోయాడు. చివరికి ఇలా హత్యకు గురయ్యాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

