OPT | ఓపీటీ రద్దు?.. అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ మరో షాక్!
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు కేంద్రంగా ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కార్యక్రమాన్ని త్వరలో రద్దు చేసే లేదా పరిమితం చేసే ప్రతిపాదన అమెరికా అంతర్గత భద్రతా శాఖ వద్ద సిద్ధంగా ఉంది.
వాషింగ్టన్: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు (International Students) కేంద్రంగా ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమాన్ని త్వరలో రద్దు చేసే లేదా పరిమితం చేసే ప్రతిపాదన అమెరికా అంతర్గత భద్రతా శాఖ వద్ద సిద్ధంగా ఉంది. ఈ ప్రతిపాదిత ఇమిగ్రేషన్ నిబంధన 2025 చివరిలో లేదా 2026 ఆరంభంలో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇది అమలైతే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, ఆపై పనిచేయడానికి ఉన్న అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపీటీ కార్యక్రమం ద్వారా, అంతర్జాతీయ విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన తర్వాత లేదా మధ్యలో తమ అధ్యయన రంగానికి సంబంధించిన ఉద్యోగంలో 12 నెలల పాటు పనిచేయడానికి అనుమతి లభిస్తుంది.
ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు అదనంగా 24 నెలల పొడిగింపు కూడా ఉంటుంది. ఈ పథకం ద్వారా ఏటా సుమారు 2,50,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనికి విరుద్ధంగా మాట్లాడారు. విదేశీ విద్యార్థులను యూఎస్ ఉన్నత విద్యా సంస్థల ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా తాను చూస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులలో సగం మందిని తగ్గించినట్టయితే, అమెరికాలోని సగం కళాశాలలు మూతపడతాయని హెచ్చరించారు. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
అమెరికాలో తగినంత నిపుణులు లేరు!
విదేశీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయ వలసదారులను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై అనూహ్య స్పందన వ్యక్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఈ వీసా ప్రోగ్రామ్ని గట్టిగా సమర్థించారు. ఆయా రంగాలలో నైపుణ్యం కలిగిన స్వదేశీ ఉద్యోగులు లేని కారణంగా విదేశాల నుంచి నైపుణ్యం తెచ్చుకోవడం దేశానికి అవసరమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికన్ ఉద్యోగుల జీతాలను తగ్గించగలవన్న భయంతోనే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను మీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందా అని ఫాక్స్ న్యూస్ ప్రతినిధి ప్రశ్నకు అవునని ట్రంప్ సమాధానమిస్తూ.. అయితే దేశానికి నిపుణుల అవసరం కూడా ఉందని స్పష్టం చేశారు. మన వద్ద నిపుణులైన సిబ్బంది లేరని స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓయూ, కాకతీయ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

