Delhi Blast | ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో జరిగిన పేలుడును ఉగ్రవాద దాడిగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. ఉగ్రవాద ఘటన విషయంలో దర్యాప్తులో భారత్ అనుసరించిన విధానాన్ని ఆయన ప్రశంసించారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మృతులకు సంతాపం ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో ఓ ప్రకటన విడుదల చేశారు. జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఆయనను ప్రశ్నించగా.. ‘భారత్ జరుపుతున్న దర్యాప్తును ప్రశంసించాలి. చాలా క్షుణ్ణంగా, జాగ్రత్తగా వ్యవహరించారు. దర్యాప్తు కొనసాగుతుంది. ఇది స్పష్టంగా ఉగ్రవాద దాడే.
ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో కారు నిండి ఉంది. పేలుడులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారు దర్యాప్తులో గొప్పగా పని చేస్తున్నారని నేను భావిస్తున్నారు. ఈ సంఘటనపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో మాట్లాడాను. భారత్‌కు స్వయంగా దర్యాప్తును నిర్వహించగల సామర్థ్యం ఉంది. ఎలాంటి సహాయం అవసరం లేదు’ అన్నారు. ఈ సంఘటన తీవ్రతను తాము అర్థం చేసుకున్నామని.. దర్యాప్తులో ఏం తెలుతుందో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నామని.. తాము సహాయం అందించామని.. కానీ, వారికి ఆ సహాయం అవసరం లేదన్నారు. వారు ఇప్పటికే బాగా పని చేస్తున్నారన్నారు. కెనడాలోని ఒంటిరాయోలో జరిగిన జీ7 సమావేశంలో జైశంకర్, రూబియో కలిశారు. చర్చల సందర్భంగాల ఢిల్లీ బ్లాస్ట్‌లో మరణించిన వారికి రూబియో సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చించారు.