న్యూఢిల్లీ : భారత్, కెనడా సోమవారం యురేనియం, కీలక ఖనిజాల సరఫరా ఒప్పందంపై సంతకం చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా ఆర్థిక భాగస్వామాన్ని పెంపొందించుకోవాలని తీర్మానించుకొన్నాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్నాయి.
రక్షణ, కీలక సాంకేతికతలు, చిన్న, మధ్య తరహా అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక విద్యుత్త వంటి రంగాల్లో పరస్పరం సహకారం అందించుకోవాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. 2023లో ఖలిస్థానీ వేర్పాటువాది హత్యపై దౌత్యపరమైన వివాదం తర్వాత దెబ్బతిన్న ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటన బాగా ఉపయోగపడింది.