హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): వరుస కుంభకోణాలతో వైద్య శాఖ వ్య వహారం రచ్చకెక్కుతున్నది. ఇటీవల మందుల కొనుగోలు, అంతుకుముందు బిల్లులకు కమీషన్లు, లాంగ్ స్టాండింగ్ అధికారుల వసూళ్ల దందాలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా సనత్‌నగర్ టిమ్స్‌లో పరికరాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వ స్తున్నాయి. టెండర్లలో పేర్కొన్న బ్రాండ్లకు బదులు నాసిరకం కొనుగోలు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం.
వైద్య పరికరాల కొనుగోలు బాధ్యతను చేపట్టిన నిర్మాణ సంస్థ తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాటిలో.. శవాలను భద్రపరిచే మార్చురీ కూలర్లు(5) శస్త్రచికిత్సలకు వాడే కత్తెరలు, సూదులు, ఇతర వైద్య పరికరాలను శుభ్రం చేయడానికి వాడే స్టీమ్ స్టెరిలైజర్ యూనిట్లు (5), వైద్య పరికరాలు ఇతర సున్నితమైన వస్తువులను వేడి, తేమ కారణంగా పాడవకుండా స్టెరిలైజేషన్ చేసేందుకు వాడే ప్లాస్మా స్టెరిలైజర్లు (2), వాషర్ డిసిన్ఫెక్టర్ విత్ యాక్సెసరీస్ (4), స్టెరిలైజ్డ్ పరికరాలు, రోటరీ హీట్ సీలర్(4), అల్ట్రా సోనిక్ క్లీనర్(3), సెలెక్టా స్ప్రే గన్(4), మాన్యువల్ ట్రే వాష్ (1), ఇన్స్పెక్షన్ మ్యాగ్నిఫయింగ్ ల్యాంప్(4), మల్టీ రోల్ టేప్ డిస్పెన్సర్(4), సెంట్రల్ స్టెరైల్ సైప్లె డిపార్ట్మెంట్ (సీఎస్ఎస్డీ) ఫర్నిచర్ (1)లు ఉన్నాయి.
ఈ పరికరాలలో ప్రతిపాదిత బ్రాండ్లను మాత్రమే కొనాలని టెండర్లో పేర్కొన్నారు. ఆ బ్రాండ్ల పేర్లను సైతం ప్రస్తావించారు. ఇందుకు టెండ ర్ ప్రక్రియలో ఆయా బ్రాండ్లకు రేట్లను సైతం ఫిక్స్ చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి తక్కువ ధరకు ఆయా పరికరాలను కొనుగోలు చేసినట్టు తెలిసింది. మొత్తం రూ.12 కోట్లు వెచ్చించి ఆయా పరికరాలను కొనాల్సి ఉండగా.. కేవలం రూ.4 కోట్లు వెచ్చించి నాసిరకం పరికరాలను.. కోట్లు కొల్లగొట్టేందుకే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌లలో సైతం నాసిరకం పరికరాలను కొనేందుకు సదరు కంపెనీతోనే ఒప్పందం కుదుర్చుకొని కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
టిమ్స్‌లో రోగులకు ఆపరేషన్ల సందర్భంగా వినియోగించే పరికరాలు, శవాలను భద్రపరిచే కూలర్ల కొనుగోలులో సైతం కక్కుర్తి పడటం విస్మయానికి గురిచేస్తున్నది. డీఎంఈ ఆమోదం లేకుండానే కొనుగోలు చే సినట్టు తెలిసింది. టెండర్లలో పేర్కొన్న బ్రాండ్లకు కొనుగోలు చేసిన పరికరాలకు మధ్య వ్యత్యాసాలను సైతం సదరు నిర్మాణ సంస్థ డీఎంఈకి వివరించలేదని సమాచారం. సరఫరాదారుల్లో ఒకరు సివిల్ ప్రొక్యూర్మెంట్ బృందంతో కుమ్మక్కై డీఎంఈ అనుమతి లేకుండానే సరఫరా చేసినట్టు సమాచారం. తర్వాత అనుమతి కోరగా.. తక్కువ నాణ్యత ఉందని డీఎంఈ అనుమతి నిరాకరించినట్టు తెలిసింది. ఈ అక్రమాలపై డీఎంఈని ‘నమస్తే’ ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు.