హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : విద్యాసంస్థల్లో వివక్షలేని ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు-2026 రూపకల్పన కోసం ఏర్పాటైన క్యాబినెట్ సబ్‌కమిటీ తొలి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ హెచ్‌సీయూలో జరిగిన రోహిత్ వేముల విషాద ఉదంతం కేవలం తెలంగాణనే కాకుండా దేశం మొత్తాన్ని కదిలించిందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో వివక్ష లేని చట్టాన్ని తేవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని తెలిపారు. అనంతరం బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): బీసీ కులవృత్తులను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం పక్కన హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన ‘బోనాలు-చేతివృత్తుల మేళా 2026’ను మంత్రి గురువారం ప్రారంభించారు. వృత్తి కళాకారులతో ముచ్చటించారు.