హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : భారీ గజమాలలను జేసీబీతో తీసుకొచ్చి నాయకులను సత్కరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని కాంగ్రెస్ ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాల్లో నాయకుల ఫొటోలకు క్షీరాభిషేకాలు, జలాభిషేకాలు చేయవద్దని ఆదేశించారు.
ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.