KTR | కాంగ్రెస్ డిక్లరేషన్ల వైఫల్యాలను ఎండగడుదాం.. కేటీఆర్ పిలుపు
యూత్ డిక్లరేషన్ పేరిట యువత, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మోసం చేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ) : యూత్ డిక్లరేషన్ పేరిట యువత, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మోసం చేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లలోని హామీల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ వరుసగా సభలు నిర్వహిస్తున్నదని తెలిపారు. వరంగల్ రైతు సభ అనంతరం, ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు.
తద్వారా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచనున్నట్టు పేర్కొన్నారు. గురువారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. యువ సంగ్రామ సభకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉన్నదని, అలాంటి ప్రయత్నాలను సమర్థంగా ఎదురొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్‌తోపాటు పరిసర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్‌కు వివరించారు. సభ ఏర్పాట్లు, నిర్వహణ, విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
కాంగ్రెస్‌ది ప్రజాకంటక పాలన
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, కేవలం సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న మాటలు, అనుసరిస్తున్న విధానాలు, సాగిస్తున్న పాలన ప్రజాకంటకంగా మారాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని, అందుకే సమాజంలోని ప్రతి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. సీఎం చేయించిన సర్వేలోనే కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రమైన ప్రజావ్యతిరేకత వ్యక్తమైందని పేరొన్నారు.
ప్రభుత్వకాలం ముగిసిపోతుందనే విషయం స్పష్టమవుతున్న నేపథ్యంలోనే సీఎం అడ్డగోలుగా మాట్లాడుతూ తన అకసును వెళ్లగకుతున్నారని చెప్పారు. ఒకవైపు వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో, కరువు అంచున ఉంటే.. సీఎం వ్యాఖ్యలు ప్రజలందరిలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయని పేరొన్నారు. చివరికి రైతులు కూడా ‘మా రక్తాన్ని తీసుకోండి.. కానీ మా పొలాలకు నీళ్లివ్వండి’ అని డిమాండ్ చేసే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. కేవలం సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది. రేవంత్ మాటలు, అనుసరిస్తున్న విధానాలు, సాగిస్తున్న పాలన ప్రజాకంటకంగా మారాయి.
– కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

