తాడూరు, జూలై 16 : తండ్రి అంత్యక్రియలు చేస్తుండగా పెద్ద కొడుకు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నోళ్ల కాలనీకి చెందిన సాయిలు (70) బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు.
గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం స్నానాలు చేస్తుండగా.. సాయిలు పెద్ద కొడుకు, దివ్యాంగుడు బంగారయ్య (55)కు ఫిట్స్ వచ్చాయి. వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.