BRS Activist | ఫర్టిలైజర్ సిటీ, జూన్ 4 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగనగర్ ఆటో స్టాండ్ వద్ద అనుమానాస్పద స్థితిలో గాదం సాగర్ (30) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. సంఘటనా స్థలంలో అపస్మారక స్థితిలో ఉన్న సాగర్ను స్థానికులు అర్ధరాత్రి హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సాగర్ మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడా..? లేక మరే కారణాలతోనైనా చనిపోయి ఉంటాడా..? అన్న కోణంలో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆర్కే 7 గనిలో పనిచేసే సాగర్ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగంలో క్రియాశీలక కార్యకర్తగా ఉంటున్నాడు.
కాగా సాగర్, అతని భార్యకు మధ్య గతంలో తరచుగా గొడవలు జరిగేవని.. దాంతో ఆమె సాగర్తో తెగదెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని, అప్పటినుంచి అతను మద్యానికి బానిస అయినట్లు తెలిసింది. అయితే ఒంటిపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సాగర్ అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు