Labourers | జ్యోతినగర్, జూన్ 10 : ప్రతీ కార్మికుడు బీమాను తప్పనిసరిగా కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్లో ఎస్బీఐ మున్సిపల్ కాంప్లెక్స్ బ్రాంచీ, రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఇన్సూరెన్స్ మేళా కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రమాదాలలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్ మరణిస్తే వారి కుటుంబానికి కొంత పరిహారం అందేలా ప్రతీ కార్మికుడు బీమాను కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ సూచించారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతుల్లో పనిచేస్తున్న వివిధ పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్లకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై అవగాహన కల్పించారు. బీమా సౌకర్యం కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుందని.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.