సిరిసిల్ల రూరల్, జూన్ 9: సిరిసిల్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ (SBI Life) ఏర్పాటు చేశామని, ఎస్బీఐ లైఫ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ కోరారు. ఎస్బీఐ లైఫ్ దేశంలో అగ్రగామిగా ముందుకు సాగుతుందని, వెయ్యికి పైగా బ్రాంచ్‌లు కొనసాగుతున్నాయన్నారు. 99 శాతం క్లెయిమ్‌లు చేస్తూ, జీవిత బీమా సేవలను అందిస్తున్నదని చెప్పారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో ఎస్బీఐ లైఫ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సిరిసిల్ల బ్రాంచ్ మేనేజర్‌గా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది, యూఎంలు, క్లబ్ మెంబర్లు, లైఫ్ మిత్రలు పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యుఎంలు అలువాల శ్రీనివాస్ యాదవ్, జక్కుల అన్వేష్ యాదవ్, శివానంద్, రంగు అనిత, క్లర్క్ ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.