పాలకుర్తి : ఓ చిరు ఉద్యోగి పిల్లలకు పలకలు అందించి(Distributing slates) తన పెద్ద మనసును చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండలం బసంత్ నగర్లోని అంగన్వాడీ కేంద్రలో పారిశుధ్య కార్మికుడు(Sanitation worker) బూడిద రామస్వామి పిల్లలకు మంగళవారం పలకలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీలో చిరు ఉద్యోగి అయిన రామస్వామి ఎంతో ఔదార్యంతో 20 మంది చిన్నారులకు పలకలు అందజేయడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కాగా, చదువుతోనే సమాజంలో గౌరవం దక్కుతుంది. చదువు విలువ తెలుసుకుని చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం పలకలు, బలపాలు పంపిణీ చేసినట్టు రామస్వామి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మహాకుంభమేళా | తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం…నాచారంలో విషాదఛాయలు