ఉప్పల్ : Mahakumbh Mela |కుంభమేళకు వెళ్లి, తిరిగి వస్తుండగా మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 8 మంది మృతి చెందారు. హైదరాబాద్ నాచారం రాఘవేంద్ర నగర్, కార్తికేయ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా NH-30పై మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తున్నది.
నాచారంలో విషాదఛాయలు
నాచారం రాఘవేంద్ర నగర్లో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా కాలనీకి చెందిన 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. నాచారం నుంచి మినీ బస్సులో ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లారు . మినీ బస్సులో 14 మంది ప్రయాణిస్తున్నారు. మంగళవారం ఉదయం కుంభమేళ ప్రయాగరాజు నుండి తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ శిరోహి ప్రాంతంలో ఉదయం 9 గంటల పది పది నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో ఏడుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలైనట్టు సమాచారం. వీరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నాచారం రాఘవేంద్ర నగర్ కు చెందిన నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి ,ఆనంద్ గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.