THE PARADISE | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తోన్న ది ప్యారడైజ్ (THE PARADISE). Nani Odela 2 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు.
ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే అనిరుధ్ రవిచందర్‌కు టీంలోకి స్వాగతం పలికింది నాని టీం.
మేకర్స్ ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఫిబ్రవరి 24న ది ప్యారడైజ్ స్నీక్ పీక్‌ను లాంచ్ చేయబోతున్నారట.
బ్లాక్ బస్టర్ దసరా కాంబో అవడం, నాని-అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ ఇటీవలే నాని- శ్రీకాంత్ ఓదెల టీం షేర్ చేసిన లుక్ నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నాని మరోవైపు హిట్ ఫేం శైలేష్ కొలను డైరెక్షన్లో మూడో పార్ట్ హిట్ 3 కూడా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Akkineni Nagarjuna | నిన్ను చూసి గర్వపడుతున్నా.. నాగచైతన్య తండేల్ సక్సెస్‌పై అక్కినేని నాగార్జున