పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని బీ పవర్ హౌస్ తెలంగాణ పవర్ ప్లాంట్ సమీపంలో అరుదైన జాతికి చెందిన పునుగుపల్లి దర్శనం ఇచ్చింది. తిరుమల శ్రీవారికి అతి ప్రీతికరమైన పునుగు పిల్లి (Punugupilli) ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ గోడౌన్ల నుంచి బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రోడ్డుపైకి ఎక్కింది. అరుదైన వన్యప్రాణి కావడంతో నక్క పోలికలు, పులి చారలతో ఉన్న ఈ అరుదైన ప్రాణిని రామగుండం రోడ్డు పై సంచరిస్తుండటంతో అటుగా వెళ్లే ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అయితే పునుగు పిల్లి కొంత నీరసంగా కనిపించడంతో దాని వెంటపడ్డారు. అది చెట్ల పొదల్లోకి పరుగులు తీయడంతో దానిని పట్టుకొని వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. ఎంతో అరుదుగా కనిపించే ఈ పునుగుపిల్లులు ఎక్కువగా శేషాచలం అడవుల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వీటి నుంచి వచ్చే తైలంతో సాక్షాత్తు ఆ తిరుమలేశుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు అర్చకులు. తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి స్వామి వారి కోసం పునుగు తైలం సేకరిస్తారు. శ్రీవారికి ఒక పూజలో ఈ తైలాన్ని ఉపయోగిస్తారు. తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు. ఈ క్రమంలో పునుగుపిల్లిల సంఖ్యను పెంచేందుకు కూడా టీటీడీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
Hawaii volcano | బద్ధలైన హవాయి అగ్నిపర్వతం.. ఫౌంటెయిన్లా ఎగసిపడుతున్న లావా
Vemula Veeresham | కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్.. పోలీసులకు వేముల వీరేశం ఫిర్యాదు
Laila| దారుణం.. సినిమా రిలీజ్ అయి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ఓటీటీలోకి..!