Hawaii volcano | అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయిలో అగ్నిపర్వతం (Hawaii volcano) బద్ధలైంది. దీంతో వంద అడుగులకుపైగా లావా (Lava) ఎగసిపడుతోంది. ప్రస్తుతం 150 నుంచి 165 అడుగుల వరకూ లావా ఓ ఫౌంటెయిన్‌లా ఎగసిపడుతున్నట్లు (Lava fountain spews) అధికారులు తెలిపారు. అయితే, ఈ పర్వతం ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల ప్రజలకు ఎలాంటి ముప్పూ లేదన్నారు.
హవాయి అగ్నిపర్వత ప్రాంతంలో ఉన్న ప్రపంచంలోని అత్యంత చురుకైన కిలోవియా శిఖరంపై బిలం నుంచి గతేడాది డిసెంబర్ 23న విస్ఫోటం మొదలైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం వద్ద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. పర్వత సమీపానికి ప్రజలు వెళ్లకుండా కఠిన ఆంక్షలు విధించారు.
Just stunning…Kilauea, by Private Volcano Tours#Kilauea #hawaii #volcanoeruption https://t.co/kAeYPp9aO9 pic.twitter.com/DXT4ktQXD7
— Stormzy (@StormzyBlonde) March 5, 2025
Also Read..
Donald Trump | యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా 13 ఏళ్ల బాలుడు.. ప్రకటించిన ట్రంప్
Tariffs | ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై సుంకాలు.. కాంగ్రెస్ సంయుక్త సెషన్లో బాంబు పేల్చిన ట్రంప్
Donlad Trump | ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన జెలెన్స్కీ.. అలా చేయడం తప్పే అంటూ పశ్చాత్తాపం