Laila| ఈ మధ్య ఓటీటీ ట్రెండ్ బాగా నడుస్తుంది. చాలా మంది థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడకుండా ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా ఓటీటీలోకి రావాలంటే ఎంత లేదన్న నెల రోజులు పడుతుంది. కాని ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్రం రిలీజ్ అయి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆహాలో ఈ చిత్రాన్ని మార్చి 7 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదిన రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ కి ముందు చిత్రంని అనేక వివాదాలు చుట్టు ముట్టాయి. ఈ క్రమంలో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణలు తెలియజేశాడు.
మూవీపై భారీ హైప్ పెరిగిన కూడా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తొలి రోజు నుండే మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. అందుకే ఈ చిత్రాన్ని ఇంత తొందరగా ఓటీటీలోకి తీసుకు వచ్చినట్టు అర్ధమవుతుంది. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయితన షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. లైలా చిత్రం ఫన్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్టైనర్గా రూపొందింది. ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో పాటు ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. లైలా చిత్రంలో ఆడవేషంలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు విశ్వక్.
పూర్తిస్థాయిలో అమ్మాయి గెటప్‌లో కనిపించడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. లైలా చిత్రంలో విశ్వక్ సేన్ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన తన పాత్ర ద్వారా అందించిన ఫన్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అయితే సరికొత్త అనుభూతిని పంచింది. లియోన్ జేమ్స్ సంగీతం కూడా సినిమాకి పెద్దగా ప్లస్ కాలేకపోయింది. అయితే ఈ మూవీని థియేటర్లో ఎవరైన మిస్ అయి ఉంటే ఇక ఏ మాత్ర ఆలస్యం చేయకుండా ఓటీటీలో చూసేయండి.