Vemula Veeresham | కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్.. పోలీసులకు వేముల వీరేశం ఫిర్యాదు
Vemula Veeresham | రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేసి న్యూడ్ కాల్స్‌తో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియో కాల్‌ను రికార్డు చేసి ఆయన మొబైల్‌కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Vemula Veeresham | రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేసి న్యూడ్ కాల్స్‌తో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియో కాల్‌ను రికార్డు చేసి ఆయన మొబైల్‌కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వివరాల ప్రకారం.. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు నిన్న రాత్రి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి అమ్మాయి నగ్నంగా కనిపించింది. మొబైల్ స్క్రీన్‌పై ఆ సీన్ చూడగానే వేముల వీరేశం ఫోన్ కట్ చేశాడు. కానీ అదంతా స్క్రీన్ రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ వీడియోను ఆయనకే పంపించారు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ వీడియోను కుటుంబసభ్యులు, మిత్రులకు పంపించడమే కాకుండా సోషల్‌మీడియాలో అప్లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపించారు.
ఆ వీడియో చూసిన వెంటనే సదరు నేతలు, కార్యకర్తలు వేముల వీరేశానికి ఫోన్ చేసి ఆరా తీశారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసుల సలహాలతో సైబర్ నేరగాళ్ల నంబర్‌ను బ్లాక్ చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

