కమాన్ పూర్ జనవరి 31 : కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన దాసరపు తిరుపతి (48) అనే వ్యక్తి ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు. వివరాలకు వెళ్తే.. తిరుపతి గత కొంతకాలంగా మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతూ ఈ ఘాతుకానికి పాటుపడ్డాడు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి గుండారం రిజర్వాయర్ వద్ద గల ప్రకృతి వనంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి కమాన్ పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..