Sugar Factory | మల్లాపూర్, జూలై 16: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయినప్పటికీ, ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మూతపడిన ముత్యంపేట చక్కర కర్మాగారాన్ని యధావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీ కనక సోమేశ్వర స్వామి కొండ నుండి ముత్యంపేట చక్కెర కర్మాగారం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంగళవారం మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే కర్మాగారం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గ్రామాల నుండి పాదయాత్రకు పెద్ద ఎత్తున రైతు సంఘం నాయకులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చి పాదయాత్రలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజ్, నాయకులు లవంగ శివ, చింతకుంట నరసారెడ్డి, మొరపు జలపతి, కొడిమ్యాల రాజేందర్, ఇల్లెందుల కాంతాయ చారి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి