సారంగపూర్ : ఇందిరమ్మ ఇండ్ల( Indiramma houses) లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. శుక్రవారం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పైలైట్ ప్రాజెక్ట్ కింద నాయకపు గూడెం ఎంపిక చేయగా గ్రామంలో లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలకు అధికారులు ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు పనులను వేగవంతం చేయాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ సలీం, ఏఈ రాజమల్లయ్య, వైస్ ఎంపిపి కొండ్రా రాంచందర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు గుర్రాల రాజేందర్ రెడ్డి, రాజేశ్వరి, కార్యదర్శి నాగరాజు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
CMRF | చెల్లని సీఎంఆర్ఎఫ్ చెక్కు.. డబ్బులు రాక లబ్ధిదారుడి ఆందోళన
Telangana | 27న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు.. ఎందుకంటే..?
Hyderabad | మా బతుకులను ఆగం చేయకండి అయ్యా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొర పెట్టుకున్న చిరు వ్యాపారులు