CMRF | చెల్లని సీఎంఆర్ఎఫ్ చెక్కు.. డబ్బులు రాక లబ్ధిదారుడి ఆందోళన
CMRF | శస్త్ర చికిత్స చేసుకుని సీఎంఆర్ఎఫ్(CMRF cheque) కోసం దరఖాస్తు చేసుకున్న ఆ లబ్ధిదారిడికి నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్న చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానిపేరున ఇది వరకే వేరొకరు నగదు తీసుకున్నారని సిబ్బంది చెప్పడంతో ఖంగు తినడం తన వంతయింది.
గంగాధర, ఫిబ్రవరి 21 : శస్త్ర చికిత్స చేసుకుని సీఎంఆర్ఎఫ్(CMRF cheque) కోసం దరఖాస్తు చేసుకున్న ఆ లబ్ధిదారిడికి నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్న చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానిపేరున ఇది వరకే వేరొకరు నగదు తీసుకున్నారని సిబ్బంది చెప్పడంతో ఖంగు తినడం తన వంతయింది. హైదరాబాద్కు తిప్పి పంపితే మరో చెక్కు రాగా, మళీ అదే పరిస్థితి ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వెంకంపల్లి గ్రామానికి చెందిన పిట్టల లలిత రెండేళ్ల క్రితం కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో శస్త్ర చికిత్స చేయించుకుంది.
ఖర్చులు ఎక్కువ కావడంతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంది. గతేడాది జూలై నెలలో రూ.12 వేల పరిహారం మంజూరైంది. గంగాధరలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా 776140 నెంబర్ తేదీ : 16-07-2024 గల చెక్కును తీసుకున్న లలిత గర్శకుర్తి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తన ఖాతాలో చెక్కును డిపాజిట్ చేయడానికి వెళ్లింది. ఇదివరకే చెక్కు నెంబర్ వేరొకరు ఉపయోగించినట్లు చెప్పి బ్యాంకు అధికారులు ఆమెను తిప్పి పంపారు.
చేసేదేం లేక స్థానిక నాయకులతో చెప్పగా చెక్కును హైదరాబాద్కు పంపించారు. తిరిగి అదే చెక్కును 776140 నంబర్ తేది:30-01-2025గా మార్చి హైదరాబాద్ నుంచి పంపించారు. కాగా, మరోసారి చెక్కును డిపాజిట్ చేయడానికి అదే బ్యాంకుకు లలిత భర్త వెంకటేశం వెళ్లగా చెక్కు నంబర్ మారితేనే డబ్బులు వస్తాయని సిబ్బంది తెలపడంతో నిరాశగా వెనుదిరిగాడు. అధికారులు స్పందించి తమకు సీఎంఆర్ఎఫ్ కింద పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

