Dava Vasantha | జగిత్యాల, సెప్టెంబర్ 16 : ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులు విద్య కొసం ఇక్కట్లు పడడం శోచనీయమని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వసంత మాట్లాడుతూ విద్యార్ధి ఉద్యమాలతో ఊపందుకోని, రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేసినా విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష, నిర్లక్ష్యం చూపడం సబబు కాదన్నారు. అసెంబ్లీ సాక్షిగా విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ మాటను మర్చిందన్నారు.
యాజమాన్యాలు పోరాటం చేసినప్పుడల్లా అధికారం అడ్డుపెట్టుకొని యాజమాన్యాలను బెదిరించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందన్నారు. విద్యా, వైద్యం రాజ్యాంగం కల్పించిన హక్కులని, వాటిని సక్రమంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు ఎరుగాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని బూటకపు మాటలతో గద్దెనెక్కిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక నిరుపేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని ఆరోపించారు.
అనేక కళాశాలలు మూత పడే పరిస్థితి..
గత మూడేళ్లుగా ఎంటీఎఫ్, రీయింబర్స్మెంట్ మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడంతో యాజమాన్యాలు సైతం ఆర్థికంగా చిక్కి శల్యం అవుతున్నాయన్నారు. నిర్వహణ భారమై ఇప్పటికే అనేక కళాశాలలు మూత పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యలు పోరాటం చేస్తామన్నా ప్రతిసారి ఎదో రూపంలో ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం, బకాయిలు విడుదల చేస్తామని మభ్యపెట్టడం తర్వాత ఇచ్చిన హామీని విస్మరించడం పరిపాటిగా మారిందన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో యాజమాన్యంలు పడుతున్న ఇబ్బందులు, వాటి వల్ల విద్యార్థులపై పడుతున్న ప్రభావంను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ బకాయిలు విడుదల చెయ్యాలని దావా వసంత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్హౌస్’ ఓఎస్టీ విడుదల