Harish Rao | జగిత్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న అశోక్‌ను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ధర్నా చేస్తుండగా.. పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుండి తొలగించారని తెలిసిందే.
ఈ నేపథ్యంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆయన డ్రైవరే కావొచ్చు. కానీ సాటి మనిషి. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక మాట మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై ధర్నా చేస్తున్నరు. అటువైపుగా బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ అశోక్ ప్రజా సమస్యల మీద స్పందించిర్రు. ధర్నా బాగానే చేస్తున్నరు కానీ రైతులు ఆగమైతున్నరు.. వడ్లు కొనుర్రి, మక్కలు కొనుర్రి అని సాటి మనిషిగా స్పందించిండు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా.. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వడ్లు, మక్కలు కొనుర్రి అని చెప్పుడు తప్పా..? అని ప్రశ్నించారు.
ప్రజలకు ప్రజాస్వామ్యంలో డా బాబా సాహెబ్ అంబేద్కర్ మనందరికీ మాట్లాడే స్వేచ్చనిచ్చారు. ఒక డ్రైవర్‌గా ఆయన స్పందిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక నియంతృత్వ వైఖరితో డ్రైవర్‌ను సస్పెండ్‌చేశారు. ఆ సస్పెండ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు వెంటనే అతని సస్పెన్షన్ ఎత్తివేయాలి. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, అతని తరఫున న్యాయపోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు.
జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నాము
ఆయన డ్రైవర్ కావొచ్చు కానీ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాడు అందుకే రైతుల పంట కొనుగోలు చేయమని చెప్పాడు దానికి సస్పెండ్ చేస్తారా?
ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు వెంటనే అతని సస్పెన్షన్ ఎత్తివేయాలని… https://t.co/RFHMfiKlLq pic.twitter.com/11GA2PhSuD
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026